ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగ్గుమన్న ఎర్రగాలకొండ ఆక్రమణ వివాదం

ABN, First Publish Date - 2021-07-24T05:25:24+05:30

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పెద్దకారంపల్లె గ్రామస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన 

రాజంపేట, జూలై23 : రాజంపేట మండలం పెద్దకారంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రగాలకొండలో ఆక్రమణ వివాదం భగ్గు మంది. కొందరు అక్రమంగా చదును చేసి ఆ క్రమించుకుంటున్నారని పేర్కొంటూ పలువు రు రాజంపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదు ట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రగాలకొండ ప్రాంతంలో గుండాపల్లె, కారంపల్లె, కారంపల్లె అరుంధతివాడ, సుబ్బరాజుపల్లె, బ్రాహ్మణపల్లె చుట్టుపక్కల గ్రామాల్లోని పశువుల మేతకు ఈ కొండ ఉపయోగపడుతోందని, అటువంటి కొండను కొందరు ఆక్రమించి చదును చేస్తున్నారని, చర్య లు తీసుకోవాలని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ కొండను ఆనుకొని ఉన్న గ్రామాల్లో 5వేల పై బడి ఆవులు, మేకలు, గొర్రెలు ఇతర పశువు లు ఉన్నాయని, అవి మేయడాని కి ఈ కొండ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వెంటనే చదును చేసిన కొండను తిరిగి స్వా ధీనం చేసుకొని ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై రాజంపేట తహసీల్దారు రవిశంకర్‌రెడ్డిని వివరణ కోరగా ఓ మాజీ సైనిక ఉద్యోగి తనకు స్థలం కావాలని వినతిపత్రం సమర్పించారని, అతని విజ్ఞప్తి మేరకు ఆ కొండను చదును చేసుకోవడానికి తాము అనుమతి ఇచ్చామన్నారు. అయితే ప్రజలు ఈ స్థలం మూగజీవాల కోసం కావాలని కోరడంతో ఉన్నతాధికారులకు తెలియజేసిన అనం తరమే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-07-24T05:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising