ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణ కార్మికులను కర్ఫ్యూ నుంచి మినహాయించాలి

ABN, First Publish Date - 2021-05-11T04:45:27+05:30

భవన నిర్మాణ కార్మికులను కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ భవ న నిర్మాణ కార్మిక సంఘం ఏరియా ప్రధాన కార్యదర్శి చిన్న ఓబన్న ప్రభుత్వాన్ని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, మే 10: భవన నిర్మాణ కార్మికులను కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ భవ న నిర్మాణ కార్మిక సంఘం ఏరియా ప్రధాన కార్యదర్శి చిన్న ఓబన్న  ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు  సోమవారం పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా సంవత్సర కాలం నుంచి రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వలన కొన్ని నెలలపాటు, లాక్‌డౌన్‌ వలన కొంతకాలం, ఉపాధి లేక తినడానికి తిండిలేక చాలా ఇబ్బందిపడ్డారని కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత  నవంబరు నుంచి కరోనా తగ్గుముఖం పట్టడంతో కార్మికులు పనులకు వెళుతున్నారని కొద్దిరోజులకే కరోనా రెండో దశ తీవ్రతరమవడంతో పనులు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల వరకే తిరగడానికి అనుమతి ఇచ్చిందని ఆ తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తోందన్నారు. దీని వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మికుల సంక్షేమా న్ని దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూ నుంచి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుధాకర్‌, ఉపాధ్యక్షుడు శేషారెడ్డి, సహా య కార్యదర్శులు కుమార్‌, సుదర్శన్‌, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising