ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ ఎన్నికల్లో పోటీ

ABN, First Publish Date - 2021-01-24T05:37:08+05:30

జిల్లాలో అన్ని చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించింది. అన్ని వార్డులు, సర్పంచలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని తీర్మానించింది. శనివారం కడప పార్లమెంటు టీడీీపీ సమన్వయ కమిటీ సమావేశం పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది.

పంచాయతీ ఎన్నికలపై చర్చిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి

టీడీపీ నేతలు

కడప, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించింది. అన్ని వార్డులు, సర్పంచలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని తీర్మానించింది. శనివారం కడప పార్లమెంటు టీడీీపీ సమన్వయ కమిటీ సమావేశం పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది.  ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులు, సర్పంచ ఎన్నికలపై చర్చించారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల ఖరారులో అవకతవకలు జరిగాయన్నారు. వల్లూరు, చెన్నూరు మండలాల్లో ఎస్సీలు అత్యధికంగా ఉన్న చోట ఆ స్థానాలను జనరల్‌కు కేటాయించారని ఆరోపించారు. రిజర్వేషన్ల అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల కమిషన, కలెక్టరుకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మాట్లాడుతూ జగన ప్రమాణ స్వీకారమప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారని, కానీ ఇప్పుడు అలా ఉండడంలేదన్నారు. ఉద్యోగులు ఎన్నికల కమిషన ఆదేశాలు పాటించాలన్నారు. టీడీపీ అన్ని చోట్ల పోటీ చేస్తుందని, ప్రజలు తమ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు. ఒక పార్టీకి వత్తాసు పలకవద్దన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. డీలర్ల వ్యవస్థను జగన నాశనం చేశారని ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన, మైదుకూరు ఇనచార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించవద్దని సూచించారు. గత ఎన్నికల్లో టీడీపీ నేతలను భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారని అన్నారు. పది సీక్రెట్‌ కెమెరాలు తెప్పించామని, పోలీసులు ఏమైనా తప్పు చేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్‌, గోవర్ధనరెడ్డి, బచ్చల పుల్లయ్య, బద్వేలు, ప్రొద్దుటూరు టీడీపీ నేతలు రాజశేఖర్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T05:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising