ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7వ అసైన్‌మెంట్‌లో పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2021-06-18T04:54:06+05:30

మండలంలోని సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన స్టీల్‌ప్లాంట్‌ పక్కన ఉన్న 7వ అసైన్‌మెంట్‌ భూముల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని కోరారు.

ఎంపీ అవినాశ్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తున్న సున్నపురాళ్లపల్లె రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 17: మండలంలోని సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన స్టీల్‌ప్లాంట్‌ పక్కన ఉన్న 7వ అసైన్‌మెంట్‌ భూముల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని కోరారు. ఆమేరకు  గురువారం పులివెందులలోని ఎంపీ నివాసంలో రైతులు  ఎంపీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013లో ఏడవ అసైన్‌మెంట్‌లో సున్నపురాళ్లపల్లె గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక ఎకరా చొప్పున 210 మందికి అప్పటి ప్రభుత్వం భూమి పంపి ణీ చేసిందన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కొంతమందికి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసి వారికి పాస్‌బుక్కులు పంపిణీ చేయగా మరికొంద పేర్లు లిస్టులో నుంచి తొలగించి అన్యాయం చేశారన్నారు.  గ్రామంలో 6వ అసైన్‌మెంట్‌లో ఉన్న రైతులకు రెండు ఎకరాలు పంపిణీ చేసి వారికి ప్రస్తుతం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూములను భూసేకరించి ఒక్కో ఎకరాకు రూ.7.5 లక్షలు ఇస్తున్నారన్నారు. 7వ అసైన్‌మెంట్‌లో ఉన్నవారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఎంపీ అవినా్‌షరెడ్డి వద్దకు వెళ్లి సమస్యను వివరించగా  జిల్లా కలెక్టర్‌ను కలువాలని ఆయన చెప్పగా వెంట నే కడపకు వెళ్లి జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ను కలిసి విషయాన్ని తెలియజేశామన్నారు.  

Updated Date - 2021-06-18T04:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising