ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారుణ్య నియామకాలు చేపట్టాలి

ABN, First Publish Date - 2021-07-30T04:46:17+05:30

కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బీవీ రమణారెడ్డి డిమాండ్‌ చేశారు.

ధర్నాలో పాల్గొన్న ఏపీటీఎఫ్‌ సంఘ ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, జూలై 29: కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బీవీ రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో కాశినాయన, కలసపాడు, బి.కోడూరు, బద్వేలు మండలాల ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నూతన పీఆర్సీ అమలు, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

నూతన విద్యావిధానం ద్వారా 3,4,5 తరగతులను విడదీసే విధానాన్ని ఆపాలన్నారు. జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి, కలసపాడు మండల అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నాడు - నేడు బోధనేతర పనుల నుంచి తప్పించాలన్నారు. కరో నాతో చనిపోయిన ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాం డ్‌ చేశారు. అనంతరం తహసీల్దారు శ్రీనివాసులరెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ సభ్యులు సుబ్బయ్య, అబ్దుల్‌సత్తార్‌, భాస్కర్‌రెడ్డి, జయరాం, వారణాశి రవి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T04:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising