ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండికోటలో ఘర్షణ

ABN, First Publish Date - 2021-01-26T05:42:10+05:30

జమ్మలమడుగు మండల పరిధిలోని పర్యాటక ప్రదేశం గండికోట లోయ సమీపాన ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ బైక్‌ను కాల్చివేశారు. మైలవరం మండలం దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు మండలం మోరగుడి సమీప గ్రామాలకు చెందిన సుమారు 50 మందికిపైగా పుట్టిన రోజు వేడుక జరుపుకునేందుకు గండికోటకు వెళ్లారు.

గండికోటలో ద్విచక్ర వాహనాన్ని కాల్చిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్విచక్ర వాహనం కాల్చివేత

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 25: జమ్మలమడుగు మండల పరిధిలోని పర్యాటక ప్రదేశం గండికోట లోయ సమీపాన ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ బైక్‌ను కాల్చివేశారు. మైలవరం మండలం దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు మండలం మోరగుడి సమీప గ్రామాలకు చెందిన సుమారు 50 మందికిపైగా పుట్టిన రోజు వేడుక జరుపుకునేందుకు గండికోటకు వెళ్లారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత భోజన సమయంలో అక్కడున్న వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఈ విజయరాజు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని కాల్చివేశారు. ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న జమ్మలమడుగు అర్బన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు రంగారావు, తిరుపాల్‌నాయక్‌, వారి సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి కాల్చిన ద్విచక్ర వాహనాన్ని పరిశీలించి కొందరిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సుమారు 15 మందికిపైగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గండికోట ప్రాంగణంలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు పెట్రేగిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-01-26T05:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising