ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి

ABN, First Publish Date - 2021-04-13T05:23:28+05:30

కరోనా కట్టడికి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ, ఇతర స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్‌, రెడ్‌కారస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు.

వీసీలో పాల్గొన్న జేసీ ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మలోల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర గవర్నర్‌ పిలుపు

కడప(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 12: కరోనా కట్టడికి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ, ఇతర స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్‌, రెడ్‌కారస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్లు, సెక్రటరీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మలోల, ఇతర రెడ్‌క్రాస్‌ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ మాట్లాడుతూ కరోనా కట్టడికి సంబంధించి ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేసుకొనేలా, మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించే విధంగా అవగాహనకల్పించాలన్నారు. అనంతరం జేసీ ధర్మచంద్రారెడ్డి జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సంస్థ చైర్మన్‌ అలపర్తి పిచ్చయ్యచౌదరి, కార్యదర్శి మునిరాజు, జిల్లా క్షేత్ర అధికారి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising