ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో భజనలు పునఃప్రారంభించాలి

ABN, First Publish Date - 2021-10-28T05:40:31+05:30

తిరుమలేశుని కీర్తిస్తూ అక్కడి మాడవీధులలో భజనలు చేసుకునేలా టీటీడీ అధికారులు జానపద కళాకారులకు వెంటనే అనుమతివ్వాలని అఖిల భారత ప్రాచీన తెలుగు జానపద వృత్తి కళాకారుల సంఘం-(తిరుపతి) వ్యవస్థాపక అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళుతున్న కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేదంటే... అలిపిరి వద్ద భజన సమ్మేళనం నిర్వహిస్తాం

నిరసన, ర్యాలీలో జానపద కళాకారులు

కడప(మారుతీనగర్‌), అక్టోబరు 27: తిరుమలేశుని కీర్తిస్తూ అక్కడి మాడవీధులలో భజనలు చేసుకునేలా టీటీడీ అధికారులు జానపద కళాకారులకు వెంటనే అనుమతివ్వాలని అఖిల భారత ప్రాచీన తెలుగు జానపద వృత్తి కళాకారుల సంఘం-(తిరుపతి) వ్యవస్థాపక అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో జానపద భజనలు చేసే కళాకారుల బృందాలు అనేక సంవత్సరాలుగా తిరుమల కొండ స్వామివారి సన్నిధిలో భజనలు చేసే సంప్రదాయం ఉందన్నారు. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రస్తుత టీటీడీ అధికారులు నిలిపివేయడం ధర్మపద్ధతి కాదన్నారు. హిందూ ధర్మ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా వివిధ కళాకారులను తిరుమల కొండకు రావద్దని హుకుం జారీ చేయడం దారుణమన్నారు. కరోనా అధికంగా ఉన్న సమయంలో భజనలు ఆపుదలచేయాలని ఆదేశాలిచ్చారని తాము అనుకున్నామని, కానీ ప్రస్తుతం ప్రభుత్వమే కొన్నిటికే తప్ప మిగతా వాటికి ఆంక్షలతో కూడిన అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో స్వామివారిని కీర్తించే కళాకారులకు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా.... తిరుపతిలో భజనలు పునఃప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ అఖిల భారత ప్రాచీన తెలుగు జానపద వృత్తి కళాకారుల సంఘం -(తిరుపతి) కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వందలాదిమంది జానపద కళాకారులు నగర వీధులలో ర్యాలీగా కలెక్టరేట్‌ చేరుకొని నిరసన ధర్నా నిర్వహించారు. టీటీడీ అధికారులు స్పందించి తిరిగి తిరుమల స్వామివారి సన్నిధిలో భజనలు చేసుకునే సంప్రదాయాన్ని కొనిసాగించేలా అనుమతులు ఇవ్వాలని లేని పక్షంలో వచ్చే నవంబర్‌ 11 న తిరుపతి అలిపిరి వద్ద నాలుగు రాషా్ట్రల కళాకారులచే భజన సమ్మేళనం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.రామకృష్ణయ్యతో పాటుగా జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్‌లోని ఏవోను కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-10-28T05:40:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising