ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-13T05:34:05+05:30

మండల పరిధిలోని ఎర్రబల్లె గ్రామానికి చెందిన గుర్రపు నరసింహులు (32) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు వివరాలి ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా నరసింహులు గ్రామానికి చెందిన ఆరున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి, వేరుశనగ పంటలను పండిస్తూ ఉండేవాడు.

1డివిఆర్‌ 12 - నరసింహులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దువ్వూరు, ఏప్రిల్‌ 12: మండల పరిధిలోని ఎర్రబల్లె గ్రామానికి చెందిన గుర్రపు నరసింహులు (32) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు వివరాలి ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా నరసింహులు గ్రామానికి చెందిన ఆరున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి, వేరుశనగ పంటలను పండిస్తూ ఉండేవాడు. అధిక వర్షాలు, పంటలు సక్రమంగా రాకపోవడంతో అప్పులు సుమారు రూ.5 లక్షలు మేరకు చేశాడు. చేసిన అప్పులు తీర్చేదారి లేక ఆదివారం సాయంత్రం ఎర్రబల్లి నుంచి మాచనపల్లెకు వెళ్లే రహదారి పొలాల్లో పురుగుల మందు తాగి ఇంటికి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న భార్య, స్థానికులు నరసింహులును హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి భార్య నీలమ్మ పేర్కొంది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న దువ్వూరు ఎస్‌ఐ కుళాయప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వం కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని దువ్వూరు మండల వ్యవసాయ సలహామండలి అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-13T05:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising