ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక కావ్యరచనా నేర్పరి.. భూతపురి

ABN, First Publish Date - 2021-03-08T05:16:50+05:30

చారిత్రక కావ్యరచనా నేర్పరి డాక్టర్‌ భూతపురి సుబ్రహ్మణ్యశర్మ అని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి కొనియాడారు.

పురస్కారం అందుకుంటున్న కసిరెడ్డి వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైవీయూ వీసీ సూర్యకళావతి

కడప(మారుతీనగర్‌), మార్చి 7: చారిత్రక కావ్యరచనా నేర్పరి డాక్టర్‌ భూతపురి సుబ్రహ్మణ్యశర్మ అని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి కొనియాడారు. డాక్టర్‌ భూతపురి సుబ్రహ్మణ్యశర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌, అల్లసాని పెద్దన సాహిత్యపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రంలోని సమావేశ మందిరంలో సుబ్రహ్మణ్యశర్మ 84వ జయంతి, 19వ స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి హాజరై మాట్లాడారు. తండ్రి పేరున ట్రస్ట్‌ ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఆయన కుమారులు మిక్కిలి అభినందనీయులన్నారు. సభాధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భూతపురి బహుముఖ ప్రజ్ణాశాలి అని, కవిగా, అవధానిగా, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులుగా ప్రసిద్ధి గాంచారన్నారు. తదుపరి ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రసిద్ధ వాఖ్యాత డాక్టర్‌ హయగ్రీవాచార్యులు, పురస్కార గ్రహీత, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిలు మాట్లాడారు. కార్యక్రమంలో వైవీయూ పూర్వ కులసచివులు ఆచార్య జి.గులాంతారీఖ్‌, వ్యాపార నిర్వహణ శాస్త్ర విభాగం అధ్యాపకుడు ఆచార్య టి.శ్రీనివాస్‌, సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం బాధ్యుడు మూల మల్లికార్జునరెడ్డి, భూతపురి కుమారులు శివరామసురేంద్రశర్మ, గోపాలకృష్ణశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. 


ధన్యురాలు.. మహాకవయిత్రి మొల్ల

రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి మహా కవయిత్రి మొల్లమాంబ ధన్యురాలని వైవీయూ వీసీ సూర్యకళావతి కొనియాడారు. మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాల తాలూకు గోడపత్రాలను ఆదివారం స్థానిక సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్ర కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. 

Updated Date - 2021-03-08T05:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising