ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ర్తీ విద్యకు మూలం సావిత్రిబాయి పూలే

ABN, First Publish Date - 2021-01-04T04:52:54+05:30

స్ర్తీ విద్యకు మూ లకారణం సావిత్రిబాయి పూలే అని మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి అధ్యక్షుడు గురుమూ ర్తి పేర్కొన్నారు.

పోరుమామిళ్లలో పూలే జయంతి వేడుకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జనవరి 3: స్ర్తీ విద్యకు మూ లకారణం సావిత్రిబాయి పూలే అని మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి  అధ్యక్షుడు గురుమూ ర్తి  పేర్కొన్నారు. సిద్దవటం రోడ్డులో సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన మాట్లాడు తూ స్ర్తీ విద్యాదాత, సంఘ సంస్కర్త భారతదేశంలోనే  ప్రథమ మహిళా ఉపాధ్యాయిని సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో  శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్‌ జయశ్రీ, గోపాలస్వామి, రంగరాజు, రామసుబ్బయ్య యాదవ్‌ పాల్గొన్నారు. 

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్‌కుమార్‌, జిల్లా గౌరవాధ్యక్షుడు ఓబుళరెడ్డి పూలే జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ఎస్‌.శశిధర్‌కుమార్‌, బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురుప్రసాద్‌, టి.శివప్రసాద్‌, శ్రీనివాసులరెడ్డి, కంచిరెడ్డి, చెన్నయ్య, మస్తానరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో....

పోరుమామిళ్ల, జనవరి 3: మహిళలకు మార్గదర్శి సావిత్రిబాయి పూలే అని సీపీఐ నేతలు అబ్దుల్‌ఖాదర్‌, పిడుగు మస్తాన పేర్కొన్నారు. ఆదివారం రంగసముద్రం పం చాయతీ తిరుపతిరెడ్డికాలనీలో నిర్వహించిన సావిత్రిభాయిపూలే జయంతిలో వారు మా ట్లాడుతూ అట్టడుగు వర్గాలకు, మహిళలకు చదువు, సంపద వంటి హక్కులు నిరాకరించబడిన దేశంలో  వాటిని ధిక్కరించి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించి గొప్ప సం ఘ సంస్కర్తగా సావిత్రిబాయి పూలే  ఆదర్శంగా నిలిచారన్నారు. మరో కార్య క్రమంలో సావిత్రిభాయి పూలేకు మా జీ ఎమ్మెల్యే కమలమ్మ, డీసీసీ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌ నివాళులర్పించారు.   

పులివెందులలో....

పులివెందుల రూరల్‌, జనవరి 3: నేటి మహి ళలు చదువుకుంటున్నారంటే అది సావిత్రి భాయి పూలే ప్రయత్నమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామ్మోహనరెడ్డి, ఏరియా కార్యదర్శి గఫూర్‌ అన్నారు.

ఆదివారం సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు చిన్ననరసింహులు, శాన వాజ్‌, రామాంజనేయులు, నితీష్‌, హతీష్‌, నిరంజన, శ్రీకాంత పాల్గొన్నారు. స్థానిక విక లాంగుల కార్యాలయంలో సావిత్రిభాయి పూ లేకి వికలాంగుల నెట్‌వర్క్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథరెడ్డి నివాళులర్పించారు. 

Updated Date - 2021-01-04T04:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising