ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-12-16T04:59:58+05:30

రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులు చేపట్టిన దేవస్థానం టూ న్యాయస్థానం మహాపాదయాత్ర తిరుపతిలో బుధవారం ముగిసింది.

అమరావతి రైతులకు మద్దతుగా కడపలో సంఘీభావ పాదయాత్ర చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంఘీభావ ర్యాలీలో టీడీపీ నేతల డిమాండ్‌ 

జమ్మలమడుగు రూరల్‌ /కడప, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులు చేపట్టిన దేవస్థానం టూ న్యాయస్థానం మహాపాదయాత్ర తిరుపతిలో బుధవారం ముగిసింది. ఆ పాదయాత్రకు మద్దతుగా బుధవారం జమ్మలమడుగు, రాయచోటితో పాటు కడప నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగులో అఖిలపక్ష నాయకులతో కలసి టీడీపీ నేతలు గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడి ్డ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రాజధాని అమరావతి ఏర్పాటు చేస్తున్నప్పుడు శాసనసభలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ సమ్మతించాడని, తాను తాడేపల్లెలోనే ఇల్లు నిర్మించుకుంటానని ప్రజలను నమ్మించాడన్నారు. అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపేశరెడ్డి మాట్లాడుతూ ఆరోజు అందరి అభివృద్ధికోసం రైతులు అమరావతిలో భూములు ఇచ్చారన్నారు. కేవలం అధికారం ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నాయకులు దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా దేవుడు సీఎం జగన్‌కు మూడు రాజధానులు వద్దని అమరావతి ముద్దు అని జ్ఞానం ప్రసాదించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, తెలుగురైతు ప్రధానకార్యదర్శి పొన్నతోట శ్రీను, కడప పార్లమెంటు తెలుగురైతు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్‌, జిల్లా కార్యవర్గవర్గ సభ్యులు ఎంవీ సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు. కడపలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి గోకుల్‌ సర్కిల్‌ మీదుగా గాంధీ విగ్రహం వరకు టీడీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ కడప నియోజకవర్గ ఇన్చార్జి అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధనరెడ్డి, నేతలు లక్ష్మీరెడ్డి, శివకొండారెడ్డి మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు దీక్షలు చేపడితే బ్రిటీష్‌ పాలకులను మించి ఉద్యమాన్ని అణచివేసేందుకు అక్రమ మార్గాలు వెతికారన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి రైతులు మహా పాదయాత్ర చేశారని ఇకనైనా బుద్ధి మార్చుకొని రాజధానిని అమరావతిలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జయకుమార్‌, అన్వర్‌హుస్సేన, వికా్‌సహరి, సునీత, పార్వతి, మాసపేట శివ, రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయచోటిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆఽధ్వర్యంలో ర్యాలీ చేశారు.

Updated Date - 2021-12-16T04:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising