ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాగైతే కట్టడి ఎలా ?

ABN, First Publish Date - 2021-05-14T05:43:09+05:30

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూను విధించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూకు మినహాయింపు ఇచ్చారు. ఈ సమయంలో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఉంది.

గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వైవీ స్ర్టీట్‌లో రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిటకిటలాడుతున్న రోడ్లు, మార్కెట్లు, వ్యాపార సముదాయాలు

కనిపించని భౌతిక దూరం

అమలు కాని 144 సెక్షన

12 దాటినా మూతపడని దుకాణాలు

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న జనం

మరో 1447 కేసులు నమోదు

నలుగురు మృతి


జిల్లాను కరోనా వణికిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం 18గంటల కర్ఫ్యూను విధించిన ప్పటికీ వైరస్‌ వ్యాప్తికి ఇంకా అడ్డుకట్ట పడలేదు. క ర్ఫ్యూ లేని సమయంలో జనం గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కొందరు పని లేకున్నా  ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు. మార్కెట్లు, వ్యాపార సముదాయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడా కానీ భౌతిక దూరం పాటించడంలేదు. కొవిడ్‌ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు. 144 సెక్షన అమలు కావడం లేదు. ఇలా అయితే ఇప్పట్లో కరోనాకు కళ్లెం పడదని నిపుణులు చెబుతున్నారు. 


కడప, మే 13 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూను విధించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూకు మినహాయింపు ఇచ్చారు. ఈ సమయంలో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఉంది. అయితే ఆ సమయంలో 144 సెక్షన అమల్లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే వ్యాపార సముదాయాల వద్ద కానీ, ఎక్కడే కానీ జనం గుమికూడకూడదు. అయితే కడపలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత పరిశీలిస్తే ఎక్కడా జనం భౌతిక దూరం పాటించడంలేదు. నగరంలోని ప్రధాన వీధులు, సర్కిళ్లలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కొన్నిచోట్ల 12గంటలు దాటినా దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. కొనుగోలుదారులతో ప్రధాన వీధులు కిటకిటలాడుతున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు సరేసరి. టీ హోటళ్ల వద్ద, మార్కెట ్లలో రద్దీ కొనసాగుతోంది. గురువారం ‘ఆంధ్రజ్యోతి’ బీకేయం స్ర్టీట్‌, వైవీ స్ర్టీట్‌, అప్సరా, క్రిష్ణా, గోకుల్‌, పాతబస్టాండు, కొత్తబస్టాండు, ఐటీఐ సర్కిళ్లను పరిశీలిస్తే ఎటు చూసినా జనం భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగానే దర్శనమిచ్చారు.


ఇలాగైతే ఎలా..?

కడప నగరం కరోనా కేసులకు పుట్టిల్లుగా మారింది. సెకండ్‌ వేవ్‌ లో రోజూ సుమారు 200కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పలువురు మరణిస్తున్నారు. కేసులు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని డివిజన్లలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ జనం నిబంధనలను పాటించ డంలేదు. అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. గతంలో జన సమూహాన్ని తగ్గించేందుకు రైతుబజారు, పాత మార్కెట్లను విభజించారు. ఎక్కడికక్కడ కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ గ్రౌండులో నిత్యావసర దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఆయా చోట్ల జనం రద్దీ తగ్గింది. స్థానికంగా కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాతమార్కెట్‌ జనంతో కిటకిటలాడిపోతోంది. కరోనా ఉఽధృతమవుతున్నా అధికారులు మాత్రం జన రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసేవారు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. జనం కూడా ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు. దీంతో కడపలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడ్డం లేదు.


పేరుకే 144 సెక్షన..!

పోలీసులు 18గంటల కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సాయంత్రం వాహనాల నియంత్రణకు రహదారులపై బారికేడ్లు అడ్డు వేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో మాత్రం నిబంధనలు అమలు చేస్తూ అనవసరంగా రోడ్డుపైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేసి ఫైన వేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ మినహాయింపు సమయంలో జనం గుమికూడకుండా చూసేందుకు 144 సెక్షన అమలులో ఉంది. ఈ సమయంలో కూడా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలి. అయితే ఇది ఎక్కడా అమలవుతున్నట్లు కనిపించడంలేదు. పోలీసులు కూడా చూసీచూడనట్లున్నారని విమర్శలున్నాయి. ఉదయం పూట పట్టించుకోకపోవడంతో జనం నిర్లక్ష్యంగా ఉన్నారు. అసలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు తిరిగే జనాన్ని చూస్తే కరోనా ఉందా అనిపిస్తుంది. అంతనిర్లక్ష్యంగా తిరిగేస్తున్నారు. జనంలో మార్పు రాకుంటే ఇప్పట్లో కరోనా కట్టడి అసాధ్యమే.


1,447 కేసులు నమోదు

జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మరో 1,447 మంది వైరస్‌ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,408 కు చేరుకుంది. నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ ్య 581కి చేరింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 1.130 మందిని డిశ్చార్జి చేయగా రికవరీ సంఖ్య 68,285కు చేరింది. 1,792 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 7,412 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు. 


మండలాల వారీగా కేసులు..

జిల్లాలో అ్యధికంగా కడపలో 274 కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరులో 230, రైల్వేకోడూరు 123, రాజంపేట 78, పెనగలూరు 53, ఓబులవారిపల్లె 48, ఒంటిమిట్ట 39, రాజుపాలెం 38, రామాపురం 37, చాపాడు 32, టి.సుండుపల్లె 29, ఎర్రగుంట్ల 28, దువ్వూరు 27, జమ్మలమడుగు, నందలూరు మండలాల్లో 26 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే పులివెందుల, ముద్దనూరు మండలాల్లో 24 చొప్పున, సంబేపల్లె, కమలాపురం, సిద్దవటం మండలాల్లో 22 వంతున, రాయచోటి, చెన్నూరు మండలాల్లో 21, సీకేదినె, చిట్వేలు, బద్వేలు  మండలాల్లో 20, వీరబల్లె 17, బి.మఠం 12, పెండ్లిమర్రి 11, ఖాజీపేట 10, మైలవరం 9,  పెద్దముడియం 8, మైదుకూరు 7, అట్లూరు, గాలివీడు, లింగాల, పోరుమామిళ్ల మండలాల్లో 6 చొప్పున, సింహాద్రిపురం, గోపవరం, వేముల మండలాల్లో 5, చిన్నమండెం 4, ఎల్‌ఆర్‌పల్లె 3, కలసపాడు 2,  తొండూరు 2, వీఎనపల్లె 2, బికోడూరు 1, కాశినాయన 1, వల్లూరు మండలంలో 1, ఇతర జిల్లా నుంచి వచ్చిన వారిలో 6 కేసులు నమోదయ్యాయి.



Updated Date - 2021-05-14T05:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising