ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటి ఆశలతో ట్రిపుల్‌ఐటీకి విద్యార్థులు

ABN, First Publish Date - 2021-01-19T05:27:40+05:30

కోటి ఆశలతో కొత్త విద్యార్థులు కొత్త క్యాంపస్‌కు చేరుకున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజనీరింగ్‌ పట్టా పొందాలనే లక్ష్యంతో విద్యార్థులు తమకు కేటాయించిన హాస్టల్‌ గదుల్లో చేరారు. ఈ నెల 4 నుంచి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో 1100మంది విద్యార్థులు చేరారు.

రిజిస్ర్టేషన కోసం క్యూలో ఉన్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇడుపులపాయలో 1100 మంది విద్యార్థులు చేరిక

వేంపల్లె, జనవరి 18: కోటి ఆశలతో కొత్త విద్యార్థులు కొత్త క్యాంపస్‌కు చేరుకున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజనీరింగ్‌ పట్టా పొందాలనే లక్ష్యంతో విద్యార్థులు తమకు కేటాయించిన హాస్టల్‌ గదుల్లో చేరారు. ఈ నెల 4 నుంచి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో 1100మంది విద్యార్థులు చేరారు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభిస్తామని అధికారులు సమాచారం పంపడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు క్యాంపస్‌కు చేరుకున్నారు టెంపరేచర్‌, పల్స్‌ను పరిశీలించి రిజిస్టర్‌లో నమోదు చేయించుకొని హాస్టల్‌ గదులు కేటాయించారు. ఒక్కసారిగా పెద్దఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు క్యాంపస్‌కు రావడంతో రద్దీ ఏర్పడింది. బాలురు, బాలికలకు ఒక్కో కౌంటర్‌ మాత్రమే ఏర్పాటుచేయడంతో మధ్యాహ్నం వరకు కొంత జాప్యం జరిగింది. ఏఓ మోహనకృష్ణ వచ్చి అదనంగా కౌంటర్‌లు ఏర్పాటుచేయించడంతో విద్యార్థుల అడ్మిషన ప్రక్రియ చకచకా సాగి హాస్టల్‌ గదులకు చేరుకున్నారు. చేరిన విద్యార్థలకు కొవిడ్‌ టెస్టు చేయించనున్నామని ఆ తర్వాతే తరగతులు ప్రారంభిస్తామని ఏఓ తెలిపారు. కాగా విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. గదులు కేటాయించడం ఆలస్యం కావడంతో విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులు భోజనానికి ఇబ్బంది పడ్డారు.

Updated Date - 2021-01-19T05:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising