ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-05-09T04:41:55+05:30

కరోనా కట్టడి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తు న్నారు. ఆ మేరకు శనివారం నుంచి పటిష్టమైన చర్యలు చేపట్టారు.

మోరగుడి వద్ద ఏర్పాటు చేసిన ఇనుప గేటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, మే 8: కరోనా కట్టడి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని  అధికారులు హెచ్చరిస్తు న్నారు. ఆ మేరకు శనివారం నుంచి పటిష్టమైన చర్యలు చేపట్టారు. నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డు, ప్రొద్దుటూరు రోడ్డు, కోవెలకుంట్ల రోడ్డు, తాడిపత్రి రోడ్డు అన్ని ప్రాంతాల్లో  మధ్యాహ్నం  12 గంటల తర్వాత ఎలాంటి షాపులు తెరచి ఉండరాదన్నారు. ఈ సమయం లో వాహనాలు తిరిగినా చర్యలు ఉంటాయన్నారు. ఇటీవల రెండు రోజుల నుంచి సాయంత్రం వేళల్లో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు రోడ్లపై తిరుగుతుండడంతో పోలీసు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మోరగుడి మూడు రోడ్ల కూడలి వద్ద ఎలాంటి వాహనాలు పట్టణంలోకి ప్రవేశించకుండా ఇనుప గేటును ఏర్పాటు చేశారు. అత్యవసరమైన పరిస్థితుల్లో 108, ఇతర ఆస్పత్రులకు సంబందించిన కేసులకు సంబందించి వాహనాలను పట్టణంలోకి అనుమతి ఇస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరు రోడ్డులో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌, వారి సిబ్బంది ద్విచక్ర వాహనాలను పట్టుకుని జరిమానాలు విధించినట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-05-09T04:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising