ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు

ABN, First Publish Date - 2021-12-04T05:05:21+05:30

సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్‌ సెంటర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరి, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జీ కవిత పేర్కొన్నారు.

మాట్లాడుతున్న జడ్జి కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎల్‌ఎస్‌ఏ సమావేశంలో జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 3: సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్‌ సెంటర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరి, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జీ కవిత పేర్కొన్నారు. శుక్రవారం నగర శివారులోని జీజీహెచ్‌లోని లెక్షరర్‌ హాలులో జాయింట్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌వర్మ ఆదేశాల మేరకు సమావేశం జరిగింది. జిల్లా న్యాయసేవ సహకార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జీ కవిత,  డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ జ్యోతి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్కానింగ్‌ సెంటర్ల కదలికలపై వైద్యశాఖ నిరంతరం నిఘా పెట్టాలని, చట్ట వ్యతిరేఖంగా వ్యవహరించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

కడప(రూరల్‌), డిసెంబరు 3: వికలాంగులు చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకొని తద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులువుగా పరిష్కరించుకోవాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. కవిత పేర్కొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యాయసేవా సదన్‌, డీఆర్‌డీఏ సమావేశపు హాలు, ఆశా నిలయంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. సదస్సులో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising