ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాశ్వత గృహ వసతి పనులు వేగవంతం

ABN, First Publish Date - 2021-12-09T04:36:02+05:30

వరద బాధిత కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పనకై ఏర్పాటు చేస్తున్న పునరావాస లేఅవుట్లను, గృహ నిర్మాణ పనులను సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ బుధవారం పరిశీలించారు.

వరద బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న స్థల లేఅవుట్లను పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పులపత్తూరులో లేఅవుట్లు పరిశీలించిన సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

రాజంపేట, డిసెంబరు8 : వరద బాధిత కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పనకై ఏర్పాటు చేస్తున్న పునరావాస లేఅవుట్లను, గృహ నిర్మాణ పనులను సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ బుధవారం పరిశీలించారు. పులపత్తూరు గ్రామ సమీపంలో సుమారు 300మందికి శాశ్వత పునరావాసం కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్‌ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఒక్కో వరద బాధిత కుటుంబానికి 5 సెంట్ల నివేశ స్థలంతో పాటు ప్రభుత్వమే ఉచితంగా అన్నిరకాల వసతులతో అధునాతన గృహాలను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని సబ్‌కలెక్టర్‌ తెలిపారు. కాలనీలో సత్వరం మంచి నీరు, రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్‌ మొదలగు అన్నిరకాల మౌళిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.  సబ్‌కలెక్టర్‌ వెంట తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-09T04:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising