ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లెక్క తేలింది

ABN, First Publish Date - 2021-03-06T05:59:25+05:30

మున్సిపోల్స్‌ బరిలో తలపడే అభ్యర్థుల లెక్క తేలింది. ఏఏ పార్టీ తరపున ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఏఏ పార్టీ ఎంతమంది స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తోందో తెలిసింది. జిల్లాలో 136 వార్డులకు 528 మంది పోటీ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపోల్స్‌ బరిలో 528 మంది అభ్యర్థులు

కడప కార్పొరేషనలో 119 మంది...

ప్రొద్దుటూరులో 125 మంది పోటీ

కడప, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపోల్స్‌ బరిలో తలపడే అభ్యర్థుల లెక్క తేలింది. ఏఏ పార్టీ తరపున ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఏఏ పార్టీ ఎంతమంది స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తోందో తెలిసింది. జిల్లాలో 136 వార్డులకు 528 మంది పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యం ఈ నెల 10న ఓటర్లు తేల్చనున్నారు. మున్సిపోల్స్‌లో జనం పల్స్‌ పట్టేందుకు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. కడపలో 27 డివిజన్లు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 32, మైదుకూరులో 24, జమ్మలమడుగు 18, ఎర్రగుంట్ల 7, బద్వేలు 25, రాయచోటిలో మూడు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కడపలో 4 వార్డుల్లో, బద్వేలులో వైసీపీకి రెబల్స్‌ బెడద వేధిస్తోంది. కడపలో రెబల్స్‌పై ఆ పార్టీ వేటు వేసింది. పోలింగ్‌ గడువు దగ్గరపడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. 


పార్టీల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులు

- కడప కార్పొరేషనలో 27 డివిజన్లకు 119 మంది పోటీ పడుతున్నారు. టీడీపీ 14, వైసీపీ 27, బీజేపీ 8, సీపీఐ 2, సీపీయం 1, కాంగ్రెస్‌ 7, స్వతంత్రులు 54 మంది బరిలో ఉన్నారు.

- మైదుకూరులోని మొత్తం 24 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 101 మంది బరిలో ఉన్నారు. టీడీపీ 24, వైసీపీ 24, బీజేపీ 4, సీపీయం 1, జనసేన 10, స్వతంత్రులు 38 మంది పోటీ చేస్తున్నారు.

- ప్రొద్దుటూరులో 32 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 120 మంది పోటీలో ఉన్నారు. వైసీపీ 32, టీడీపీ 29, బీజేపీ 14, ఎంఐఎం 1, సీపీఐ 1, కాంగ్రెస్‌ 1, స్వతంత్ర అభ్యర్థులు 40 మంది బరిలో ఉన్నారు. 

- జమ్మలమడుగులో 18 స్థానాలకు 51 మంది పోటీలో ఉన్నారు. వైసీపీ 18, బీజేపీ 16, సీపీఐ 1, సీపీయం 1, స్వతంత్రులు 21, జనసేన ఇద్దరు పోటీ చేస్తున్నారు. 

- యర్రగుంట్లలో 7 స్థానాలకు 26 మంది పోటీ చేస్తున్నారు. వైసీపీ 7, టీడీపీ 3, బీజేపీ 4, సీపీఐ 1, కాంగ్రెస్‌ ఇద్దరు బరిలో ఉన్నారు. 

- బద్వేలులో 25 స్థానాలకు 90 మంది పోటీలో ఉన్నారు. వైసీపీ 25, టీడీపీ 15, బీజేపీ 3, సీపీఐ 2, సీపీయం 3, రెబల్స్‌, స్వతంత్రులతో కలిపి 45 మంది పోటీలో ఉన్నారు.

- రాయచోటిలో 3 స్థానాలకు గాను 8 మంది పోటీలో ఉన్నారు. వైసీపీ 3, టీడీపీ 3, స్వతంత్రులు ఇద్దరు బరిలో ఉన్నారు.

Updated Date - 2021-03-06T05:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising