ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-01-19T05:24:07+05:30

జిల్లాలో 24 గంటల వ్యవధిలో మళ్లీ 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,361కు చేరింది. ఇంతవరకు 533 మంది కరోనాతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో మళ్లీ 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,361కు చేరింది. ఇంతవరకు 533 మంది కరోనాతో మృతి చెందారు. ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కరోజు వ్యవధిలో మళ్లీ 19 మందిలో వైరస్‌ నిర్ధారణ అయింది. చికిత్స పొంది కోలుకున్న 54,796 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 84 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు.


మూడో రోజు 837 మందికి కరోనా వ్యాక్సిన

జిల్లాలో మూడోరోజైన సోమవారం 837 మందికి కరోనా వ్యాక్సిన వేసినట్లు డీఎంహెచవో అనిల్‌కుమార్‌ తెలిపారు. కేంద్రాల వారీగా పరిశీలిస్తే రిమ్స్‌ ఆస్పత్రిలో 36 మందికి, అక్కాయపల్లెలో 67, చెన్నూరులో 20, పెండ్లిమర్రి 20, దువ్వూరు 35, మైదుకూరు 34, కల్లూరు 37, ప్రొద్దుటూరు 49, జమ్మలమడుగు 37, ముద్దనూరు 8, పులివెందుల 87, తాళ్లపల్లె 29, రాయచోటి 60, దేవపట్ల 43, పుల్లంపేట 28, రైల్వేకోడూరు 44, రాజంపేట 46, నందలూరు 37, బద్వేలు 54, పోరుమామిళ్లలో 66 మందికి వ్యాక్సిన వేశామన్నారు. ఈనెల 16న 1124, 17న 900, 18న 837 మందికి టీకా వేశామన్నారు. ఇప్పటివరకు మొత్తం 2861 మంది వ్యాక్సిన వేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-01-19T05:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising