ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 నుంచి రెండవ డోస్‌ వ్యాక్సిన

ABN, First Publish Date - 2021-05-15T05:36:07+05:30

కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు ఈ నెల 17 వతేదీ సోమవారం నుంచి జిల్లాలో రెండవ డోస్‌ వ్యాక్సినేషన పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

4 వారాలు దాటిన వారికి కోవాక్సిన

12 వారాలు దాటిన వారికి కోవిషీల్డ్‌

ప్రస్తుతం మొదటి డోసు లేదు

కలెక్టర్‌ సి.హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), మే 14: కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు ఈ నెల 17 వతేదీ సోమవారం నుంచి జిల్లాలో రెండవ డోస్‌ వ్యాక్సినేషన పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణుల కమిటీని సంప్రదించిన త రువాత కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన కాల వ్యవధిని పెంచిందని తెలిపారు. దాని ప్రకారం కోవిషీల్డ్‌కు 12-16 వారాలు కాలవ్యవధి, కోవాక్సినకు 4 వారాలు దాటిన వారు రెండవ డోస్‌ వేసుకోవాలని సూచించారు. ఈ మార్పులకు అనుగుణంగా కోవిన సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేసి తిరిగి ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి రెండవ డోస్‌ వ్యాక్సినేషన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఏరోజు ఎవరికి టీకా వేస్తారో, ఏ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలో 24 గంటల ముందే ఫోన కాల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా జిల్లా యంత్రాంగం సమాచారం ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే వలంటీర్లు, ఆశ వర్కర్లు ద్వారా వ్యాక్సినేషన స్లిప్పులు ఇస్తామని తెలిపారు. సమాచారం అందుకున్న వారు సంబంధిత ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి సంయమనంతో భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి వేయించుకోవాలని కోరారు. మిగిలిన వారు అవకాశం వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలనీ కలెక్టర్‌ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-05-15T05:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising