ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

128 గుట్కా బస్తాలు స్వాధీనం

ABN, First Publish Date - 2021-05-13T05:09:42+05:30

ఐచర్‌ వాహనంలో తరలిస్తున్న రూ.8.95 లక్షల విలువ చేసే 128 బస్తాల నిషేఽధిత గుట్కాను స్వాధీనం చేసుకుని నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

పట్టుబడ్డ గుట్కా బస్తాలతో డీఎస్పీ సునీల్‌, పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురు అరెస్టు

కడప(క్రైం), మే 12: ఐచర్‌ వాహనంలో తరలిస్తున్న రూ.8.95 లక్షల విలువ చేసే 128 బస్తాల నిషేఽధిత గుట్కాను స్వాధీనం చేసుకుని నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కడప డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సునీల్‌ వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల బైపాస్‌ రోడ్డు వైపు నుంచి వస్తున్న ఐచర్‌ వాహనం పోలీసులను చూసి ముద్దనూరు వైపు వేగంగా వెళ్లిందన్నారు. ఎరగ్రుంట్ల పోలీసులు సీఐ సదాశివయ్య ఆధ్వర్యంలో వెంబడించి ఆ వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. వాహనంలోని ఇద్దరు వ్యక్తులను విచారించగా నిషేఽధిత గుట్కాను  కర్నాటక రాష్ట్రం చిక్బల్లాపూర్‌ నుంచి తెచ్చి ప్రొద్దుటూరులోని వ్యాపారులు ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సురేష్‌లకు ఇవ్వడానికి తీసుకెళుతున్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు ఐచర్‌ లారీ ఓనరు వెంకటరమణ, డ్రైవరు దేవగుడి రామాంజనేయులుతో పాటు గుట్కా వ్యాపారులు ఇద్దరినీ అరెస్టు చేశామన్నారు.

Updated Date - 2021-05-13T05:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising