ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి రవాణా చేస్తున్న 11 మంది అరెస్టు

ABN, First Publish Date - 2021-05-15T05:35:00+05:30

నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 120 కిలోల గంజాయి, కారు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిందితులలో ఆరుగురు మహిళలు

120 కిలోల గంజాయి, కారు, నగదు, సెల్‌ఫోన్లు స్వాఽధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ కేకేఎన అన్బురాజన

కడప(క్రైం), మే 14: నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 120 కిలోల గంజాయి, కారు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ కేకేఎన అన్బురాజన కడప డీఎస్పీ బి.సునీల్‌, చిన్నచౌకు సీఐ అశోక్‌రె డ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. విశాఖపట్టణం జిల్లా చింతపల్లె మండలం వంగసార గ్రామానికి చెందిన కొర్ర మత్స్యరాజు ఏజన్సీ ఏరియాలో గంజాయి పండించి కడప జిల్లాకు చెందిన వారికి విక్రయించేవాడు. ఇతను నేలపాటి లక్ష్మీదేవి, తులసి, అక్కిదాసరి శ్రీహరితో కలిసి అక్కడి నుంచి తెచ్చిన గంజాయిని కడప జిల్లాలో కొందరికి అమ్మేవాడు. ఈ మేరకు సమాచారం రావడంతో కడప డీఎస్పీ, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాధరెడ్డి, సీఐ సత్యనారాయణ సిబ్బందితో నిఘా ఉంచి గురువారం సాయంత్రం చలమారెడ్డిపల్లె క్రాస్‌ వద్ద కారులో వస్తున్న వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి 120 కిలోల గంజాయి, 5 సెల్‌ఫోన్లు, రూ.7వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.


అరెస్టయిన వారు వీరే

విశాఖ జిల్లా చింతపల్లి మండలం వంగసార గ్రామానికి చెందిన కొర్ర మత్స్యరాజు,  ప్రకాశం జిల్లా గిద్దలూరుటౌనకు చెందిన తులసి అరెస్టయ్యారు. వీరితో పాటు జిల్లా వాసులు ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలోని ఎస్టీ కాలనీకి చెందిన మేనపాటి ల క్ష్మిదేవి, పోరుమామిళ్ల టౌన గిరినగర్‌కు చెందిన అక్కిదాసరి శ్రీహరి, కడప మాసాపేట నిర్మల స్కూలు సమీపంలో నివాసం ఉండే  రాజేశ్వరి, పూల అంజనమ్మ, పూల శిరీష, పూలరాజేష్‌, పూల సరస్వతి, కడప తారకరామనగర్‌కు చెందిన పూలనాగరాజు, కాశినాయన మండలం వంకమర్రి గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన బాలసారి కిశోర్‌ అరెస్టయ్యారు.

Updated Date - 2021-05-15T05:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising