ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

104 కాల్‌ సెంటర్ల సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2021-04-17T05:05:42+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్ల సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

ముఖ్యమంత్రి వీసీలో పాల్గొన్న జేసీలు గౌతమి, సాయికాంత్‌ వర్మ, ఎస్పీ అన్భురాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీసీలో కలెక్టర్లకు, ఎస్పీలు, జేసీలకు ముఖ్యమంత్రి ఆదేశం


కడప(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్ల సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లతో కొవిడ్‌ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్లు ఎం.గౌతమి,  సీఎం సాయికాంత్‌ వర్మ,  ఎస్పీ  కేకే అన్బురాజన్‌, జిల్లా అధికారులు, కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం  జాయింట్‌ కలెక్టర్లు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కొవిడ్‌ ఆసుపత్రుల్లో శానిటేషన్‌, భోజన వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో సిబ్బంది, వసతుల కొరత లేకుండా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ, కొవిడ్‌ నోడల్‌ అధికారులను జాయింట్‌ కలెక్టర్లు ఆదేశించారు. కొవిడ్‌కు సంబంధించి ఏదైనా సందేహం ఉన్నా 104కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. 104 కాల్‌ సెంటరు సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే విధంగా అధికారులు  విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కొవిడ్‌ పరీక్ష మొదలు వైద్యం, ఆసుపత్రులలో మెడిసిన్‌, శానిటేషన్‌, క్వాలిటీ ఆఫ్‌ పుడ్‌ వరకు  ఏమాత్రం రాజీ లేకుండా అందించే విధంగా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంఅడ్‌హెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్లర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising