ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాపై ఇంకా నాలుగు కేసులు పెట్టుకోండి: జేసీ ప్రభాకరరెడ్డి

ABN, First Publish Date - 2021-07-31T22:12:00+05:30

నాపై ఇంకా నాలుగు కేసులు పెట్టుకోండి: జేసీ ప్రభాకరరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఇప్పటి వరకు తనపై 72 కేసులు పెట్టారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అన్నారు. ఇంకా నాలుగు కేసులు పెట్టుకోండని, జైలుకు పోయేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై వర్రీ అవుతున్నానని, ఎవరిని సంతోష పెట్టేందుకు కేసులు  పెడుతున్నారని ప్రశ్నించారు. ఎక్కడ దాక్కునా పోలీసులు వదిలిపెట్టరన్నారు. కొంతమంది పాలకులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. టైగర్ మ్యానిటర్ అయినట్లుగా తాడిపత్రిలో  ఓ ఆయన  ఎమ్మెల్యే పెద్దారెడ్డి తోటకు వెళ్లి నమస్కారం పెట్టివస్తోందన్నారు. తాడిపత్రిలో సమస్యలన్నింటికీ కారణం మ్యానిటర్ ఒకటిన్నర సంవత్సరం క్రితమే ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకే తాను జవాబు ఇచ్చాని పేర్కొన్నారు. ‘‘నిన్ను కొడతా.. రెండు సెకండ్లలో ఊరి విడిపిస్తా అని  మాట్లాడటం రెచ్చగొట్టడం కాదా? అరెస్టులకు భయపడను. వాళ్లు రమ్మంటే మేం పోతావుంటాము. ఎవరొస్తే వాళ్లను సతాయిస్తారంటే... రేపు ప్రభుత్వం మారితే పరిస్థితులు ఎలా వుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. మీసాలు తిప్పితే కేసులు పెడుతారా? అని ప్రశ్నించారు. న్యాయ పరంగానే పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేసి వుంటే తాను మీసం మెలేసేవాడిని కాదన్నారు.


Updated Date - 2021-07-31T22:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising