‘నారాయణ స్వామికి పదవిపై ఉన్న వ్యామోహం ప్రజాసమస్యలపై మీద లేదు’
ABN, First Publish Date - 2021-10-21T18:39:04+05:30
పాలసముద్రం మండల కేంద్రంలో రోడ్డు బాగు చేయాలని బురద నీటిలో పొర్లు దండాలతో జనసేన వినూత్న నిరసనకు దిగింది. నెల్లూరు
చిత్తూరు : పాలసముద్రం మండల కేంద్రంలో రోడ్డు బాగు చేయాలని బురద నీటిలో పొర్లు దండాలతో జనసేన వినూత్న నిరసనకు దిగింది. నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పొన్న యుగంధర్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి పదవి మీద ఉన్న వ్యామోహం ప్రజాసమస్యలపై మీద లేదంటూ నేతలు విమర్శించారు. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం గంగాధర్ నెల్లూరులో అన్ని మండలాల్లోనూ రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటూ జనసేన ఆందోళనకు దిగింది.
Updated Date - 2021-10-21T18:39:04+05:30 IST