ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేనకు అండగా చిరంజీవి?

ABN, First Publish Date - 2021-01-27T21:10:31+05:30

జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేనకు చిరంజీవి మద్దతు ఉండనుందని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేనకు చిరంజీవి మద్దతు ఉండనుందని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో బుధవారం మాట్లాడిన ఆయన.. పవన్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడు ఉంటారని అన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి చిరంజీవి కారణమని తెలిపారు. ఓ రెండేళ్లు సినిమాలు చేయాలని పవన్‌కు చిరంజీవి సూచించారని.. ఆయన సూచన మేరకే పవన్ సినిమాలు చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రస్థానంలో తాను కచ్చితంగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు. 


నాదెండ్ల వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అంతేకాదు రానున్న తిరుపతి ఉపఎన్నికలో జనసేన నిలిస్తే... పార్టీకి చిరంజీవి మద్దతుగా నిలుస్తారన్న టాక్ వినపడుతోంది. గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌కి చిరంజీవి తోడుగా ఉంటారని.. జనసేన గెలుపునకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

Updated Date - 2021-01-27T21:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising