ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటేయలేదని పది కుటుంబాలు వెలి

ABN, First Publish Date - 2021-03-04T08:55:19+05:30

ఇటీవల జరగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో ఆ పార్టీకే చెందిన పది కుటుంబాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీలో అంతర్గత విభేదాల ఫలితం


కాజులూరు (కరప), మార్చి 3: ఇటీవల జరగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో ఆ పార్టీకే చెందిన పది కుటుంబాలను సంఘ బహిష్కరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాధగిరి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జగన్నాధగిరి గుత్తులవారిపేటకు చెందిన పది కుటుంబాల సభ్యులు పెద్దల మాట కాదని వైసీపీ బలపర్చిన అభ్యర్థికి కాకుండా రెబల్‌ అభ్యర్థికి ఓటేశారు. దీనివలన బెట్టింగ్‌లో రూ.15 లక్షలు పోగొట్టుకున్నామని కొంతమంది పెద్దలు వారిని వెలివేశారు. దీనిపై మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. బుధవారం కాజులూరు పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని కూడా కలిసి తమను రక్షించాలని కాళ్లమీదపడి ప్రాధేయపడినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-04T08:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising