ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త సీఎంల జాబితాలో జగనే నెంబర్‌ వన్‌: లోకేశ్‌

ABN, First Publish Date - 2021-12-10T00:58:57+05:30

చెత్త ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి: చెత్త ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం  పర్యటించిన ఆయన స్థానిక సమస్యల గురించి విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి నివాసానికి కూతవేటుదూరంలోనే మత్తుపదార్థాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. ప్రజలు దొంగల భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండటం సిగ్గుచేటన్నారు.


ఎన్నికల ముందు లోకేశ్‌ గెలిస్తే ఇళ్లు పీకేయిస్తాడని విషప్రచారం చేశారని నేడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేదవాళ్ల ఇళ్లను నిర్థాక్ష్యిణ్యంగా పీకేయిస్తూ తన అసలురూపాన్ని బట్టబయలు చేసుకున్నారని దుయ్యబట్టారు. రెండుసార్లు గెలిచిన ఆళ్ల నియోజకవర్గానికి గెస్ట్‌ లెక్చరర్‌గా మారారని విమర్శించారు. సీఎం నివాసం ఉంటున్న నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లున్నా.. ఇసుక అందుబాటులో లేదంటే ఇసుకంతా ఎక్కడికి వెడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక కమీషన్లను ఎమ్మెల్యే, మంత్రి నుంచి ఎంతమంది పంచుకుంటున్నారని లోకేశ్ ప్రశ్నించారు. 


Updated Date - 2021-12-10T00:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising