ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శేషాద్రి గారి మరణం టీటీడీ వ్యవస్థలో తీరని లోటు : ఐవైఆర్ కృష్ణారావు

ABN, First Publish Date - 2021-11-29T14:43:08+05:30

డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. డాలర్ శేషాద్రి నిర్విరామంగా, నిరంతరాయంగా అలుపూ సొలుపూ లేకుండా స్వామివారి సేవకు అంకితమయ్యారని కొనియాడారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. డాలర్ శేషాద్రి నిర్విరామంగా, నిరంతరాయంగా అలుపూ సొలుపూ లేకుండా స్వామివారి సేవకు అంకితమయ్యారని కొనియాడారు. ‘‘శేషాద్రి గారి మరణం టీటీడీ వ్యవస్థలో ఒక తీరని లోటును మిగిల్చింది. అన్ని కార్యక్రమాలు వ్యవహారాలు టీటీడీలో సరైన సమయంలో సక్రమంగా జరగడంలో ఆయన పాత్ర ఉన్నది. ఛాందస మైన వ్యక్తి కాదు. నిర్విరామంగా నిరంతరంగా అలుపు సొలుపు లేకుండా స్వామివారి  సేవకు అంకితమైన వ్యక్తి. టీటీడీ అర్చక వ్యవస్థలో నిరాదరణకు గురి అయిన గుమాస్తా అర్చకులకు ఈయన ఒక పెద్ద అండ. పీవీఆర్కే ప్రసాద్ గారి సమయంలో ఆయనచే ఎన్నుకోబడి గర్భాలయంలో తన విధులను ప్రారంభించిన శేషాద్రి గారు క్రమక్రమంగా తన సామర్థ్యంతో వచ్చిన ప్రతి అధికారికీ కీలకమైన సహాయకునిగా తన విధిని నిర్వహించాడు. శ్రీ శేషాద్రి గారికి సద్గతి ఆ శ్రీనివాసుడే ప్రసాదించుగాక’’ అని ఐవైఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-29T14:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising