ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భగవాన్‌’ పాము పెంపకమా?

ABN, First Publish Date - 2021-02-27T09:02:28+05:30

డ్యాన్స్‌ షో కోసం ఓ యువకుడు ఏకంగా కొండచిలువను పెంచుకోవడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం లక్ష్మీనగర్‌లోని నాగిరెడ్డి అనే వ్యక్తి భగవాన్‌ కొబ్రా డ్యాన్స్‌ గ్రూపు నిర్వహిస్తుంటాడు. నిజమైన పాముతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు, ఫిబ్రవరి 26: డ్యాన్స్‌ షో కోసం ఓ యువకుడు ఏకంగా కొండచిలువను పెంచుకోవడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం లక్ష్మీనగర్‌లోని నాగిరెడ్డి అనే వ్యక్తి భగవాన్‌ కొబ్రా డ్యాన్స్‌ గ్రూపు నిర్వహిస్తుంటాడు. నిజమైన పాముతో స్నేక్‌ డ్యాన్స్‌ చేసేందుకు దీనిని తీసుకుని వచ్చి పెంచుతున్నాడు. పరిసరాల్లోని పిల్లలు ఆడుకుంటున్న సమయంలో బంతి భగవాన్‌ ఇంటి బాత్రూమ్‌లో పడింది. తెచ్చుకునేందుకు వెళ్లిన పిల్లలకు అక్కడ పాము కనిపించడంతో భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అటవీశాఖ అధికారులతో వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది నెలల వయసు.. 11 అడుగుల పొడవు.. 45 కిలోల బరువున్న దీనిని నల్లజర్లలోని అటవీ శాఖాధికారులకు అప్పగించినట్టు  పట్టణ ఎస్‌ఐ ఫజల్‌ రహ్మన్‌ తెలిపారు. 

Updated Date - 2021-02-27T09:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising