రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఉత్పత్తి
ABN, First Publish Date - 2021-10-21T11:13:35+05:30
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్.. ఉత్పత్తి దాదాపు సమాన స్థాయికి చేరుకున్నాయ. బుధవారం 203 మిలియన్ యూనిట్లు (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉండగా..
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్.. ఉత్పత్తి దాదాపు సమాన స్థాయికి చేరుకున్నాయ. బుధవారం 203 మిలియన్ యూనిట్లు (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉండగా.. జెన్కో విద్యుత్కేంద్రాల్లో 98 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది. ఇందులో థర్మల్ 76 మిలియన్ యూనిట్లు, జలవిద్యుత్‌లో 26 మిలియన్ యూనిట్లు, పునరుద్పాదక విద్యుత్‌లో 3 మిలియన్ యూనిట్లు ఉత్పత్తయింది. మరో 12 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. దీంతోపాటు కేంద్రం అందించే విద్యుత్‌లో డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లభించినట్టయింది. బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్తు ధర రూ.5కి తగ్గిపోయిందని ఇంధనవర్గాలు తెలిపాయి.
Updated Date - 2021-10-21T11:13:35+05:30 IST