ఫ్యాన్‌కు ఓటేస్తే ఇళ్లలో ఫ్యాన్‌లు తిరగవు: తులసిరెడ్డి
ABN, First Publish Date - 2021-10-29T09:34:10+05:30
ఫ్యాన్‌కు ఓటేస్తే ఇళ్లలో ఫ్యాన్‌లు తిరగవు: తులసిరెడ్డి
వేంపల్లె/కడప(కలెక్టరేట్), అక్టోబరు 28: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇళ్లలో ఫ్యాన్‌లు తిరగవని, బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర రూ.2వేలు అవుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. వైసీపీ, బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా, దౌర్జన్యాలకు భయపడకుండా ఓటర్లు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మను గెలిపించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గురువారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెండున్నరేళ్ల పాలనలో విద్యుత్ రంగం అస్తవ్యస్తమైందని.. కరెంటు కోతలు, వాతలు తప్పడంలేదని విమర్శించారు. కాగా, రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయని, అందుకు పోలీసుశాఖ సహకారం అప్రజాస్వామికమని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మొయప్ప మండిపడ్డారు. గురువారం కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. బదే ్వలు ఉప ఎన్నిక నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామన్నారు.
Updated Date - 2021-10-29T09:34:10+05:30 IST