ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravati: అప్పుడు ప్రజావేదిక.. ఇప్పుడు ఐకానిక్‌ వంతెన

ABN, First Publish Date - 2021-07-17T20:43:15+05:30

విజయవాడ-అమరావతిని కలిపేందుకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించిన ప్రజావేదిక ధ్వంసమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయవాడ-అమరావతిని కలిపేందుకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించిన ప్రజావేదిక ధ్వంసమైంది. ఇప్పుడు ఐకానిక్‌ వంతెన ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం మొదలైంది. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ... రాజధాని నిర్మాణం చేపట్టకపోగా గత ప్రభుత్వం హయాంలో అక్కడ కట్టిన నిర్మాణాలను, పనుల కోసం చేసుకున్న ఏర్పాట్లను సమూలంగా రూపమాపే ప్రయత్నం చేస్తోందని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమరావతి పరిధిలో ఉన్న ప్రజావేదికను కూల్చివేయగా.. ఇప్పుడు ఐకానిక్‌ వంతెనను కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రైతుల చెబుతున్నారు. వంతెన నిర్మాణం కోసం నిర్మించిన ప్లాట్‌ఫాంలు వారం రోజులుగా పగలకొట్టే ప్రయత్నం జరుగుతోంది.


రూ. 1,327 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించాలని గత ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. విజయవాడలోని గొల్లపుడి నుంచి ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం సమీపం వరకు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఎల్‌ అండ్ టీ కంపెనీ దక్కించుకుంది. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం సమీపంలో కృష్ణానది గట్టుకు అనుకుని ఆరులైన్లతో 3.2 కిలోమీటర్లు ఐకానిక్ వంతెన నిర్మించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక్కొటి నాలుగు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు ఉన్న మూడు ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు. అయితే వారం రోజులుగా వంతెన కోసం నిర్మించిన ప్లాట్‌ఫాంలు కూల్చివేస్తున్నారు.

Updated Date - 2021-07-17T20:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising