ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యుడు రాజధానిలో ఉండలేని పరిస్థితి: మంత్రి సుచరిత

ABN, First Publish Date - 2021-12-15T23:06:28+05:30

రాష్ట్రంలోని సామాన్యుడు రాజధానిలో ఉండలేని పరిస్థితిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాష్ట్రంలోని సామాన్యుడు రాజధానిలో ఉండలేని పరిస్థితిని గత ప్రభుత్వ నాయకులు తీసుకొచ్చారని హోం మంత్రి సుచరిత అన్నారు. నగంరలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీకి 2019లో అధికారం ఇచ్చారనన్నారు. ప్రజలకు మంచి చేయడం చూసి టీడీపీ తట్టుకోలేపోతుందన్నారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆమె అన్నారు. కుప్పం ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబును ఆసుపత్రిలో చూపించాలని కుటుంబ సభ్యులకు చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు.  జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలను  టీడీపీ నాయకులు తప్పుపడుతున్నారన్నారు. కానీ న్యాయ వ్యవస్థలు ఏవిధంగా ఉన్నాయో ఉన్నది ఉన్నట్లు రిటైర్డ్ జస్టిస్ చంద్రు చెప్పారని ఆమె పేర్కొన్నారు. 


ఇంతకీ చంద్రు ఏమన్నారు..?

ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.

Updated Date - 2021-12-15T23:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising