ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిన 20 రోజులకి స్వదేశానికి

ABN, First Publish Date - 2021-02-01T08:38:35+05:30

కాకినాడ వాస్తవ్యుడు పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వీసాలో ఒక సంస్థ.. మరోచోట పనిచేస్తూ మృతి
  • కఠిన నిబంధనలతో పోలీసు విచారణ ఆలస్యం
  • ఎట్టకేలకు స్వదేశానికి కాకినాడ ప్రవాసీ మృతదేహం


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): కాకినాడ వాస్తవ్యుడు పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లాడు. చేస్తున్న ఉద్యోగానికి తోడు పార్ట్‌ టైంగా మరొక చోట పనిచేస్తే నాలుగు దిర్హాంలు వెనకేసుకుని ఆర్థిక కష్టాలను అధిగమించొచ్చని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ షార్జాలో మృత్యువాతపడ్డాడు. వీసాలో చూపిన సంస్థలో కాకుండా వేరొకచోట పనిచేస్తూ చనిపోవడం, కఠినమైన వీసా నిబంధనల కారణంగా అతని మృతదేహం స్వదేశానికి పంపడానికి 20 రోజులు పట్టింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన వానపల్లి శ్రీనివాస్‌ (39) దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నాడు. తాను చేస్తున్న ఉద్యోగంతో పాటు దుబాయ్‌, షార్జా నగరాల్లోని వివిధ పరిశ్రమల్లోనూ పార్ట్‌ టైంగా కొన్ని పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం ఒక సంస్థలో ట్యాంకులు మరమ్మతులు చేసేందుకు వెళ్లి అక్కడ వెలువడిన విషవాయువల కారణంగా ఊపిరాడక చనిపోయాడు.  దుబాయ్‌లోని ఎన్నారై కోఆర్డినేటర్‌ ప్రసన్న సోమిరెడ్డి సమన్వయంతో శ్రీనివాస్‌ చనిపోయిన 20 రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని శనివారం స్వదేశానికి పంపించారు. 

Updated Date - 2021-02-01T08:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising