ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఛార్జిషీట్ వేసేందుకు సీబీఐకి అనుమతి

ABN, First Publish Date - 2021-09-30T03:50:03+05:30

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఛార్జిషీట్ వేసేందుకు సీబీఐకి అనుమతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో చార్జిషీటు వేసేందుకు సీబీఐ అనుమతి కోరింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేసింది. సుధాకర్ వ్యవహారంలో ఐదుగురు అధికారుల పాత్ర ఉందని సీబీఐ తేల్చింది. అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఐదుగురు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో హైకోర్టు అంగీకరించింది. 


కాగా కోవిడ్ సమయంలో ఆస్పత్రిలో గ్లౌజులు, మాస్కులు లేవని డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యానించడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. అంతేకాదు సుధాకర్‌పై కేసు కూడా నమోదు అయింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆయనకు మానసిక పరిస్థితి బాగోలేదని విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో కేసును సీబీఐకు అప్పగించింది. కేసు విచారణలో ఉన్న సమయంలో సుధాకర్ గుండె పోటుతో మరణించారు. 

Updated Date - 2021-09-30T03:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising