ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామ హౌస్‌మోషన్ పిటిషన్ డిస్మిస్

ABN, First Publish Date - 2021-05-15T19:32:24+05:30

ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సీఐడీ కోర్టులో ప్రయత్నించమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని హైకోర్టు సూచించింది. అనంతరం రఘురామ బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పుకాపీని కూడా వెంటనే ఇస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు.. వెంటనే రిమాండ్‌కు పంపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


కాగా.. జగన్ సర్కార్‌పైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. శనివారం నాడు రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, మరో చానల్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. మంగళగిరి సీఐడీ పీఎస్‌లో 124ఏ,153ఏ, రెడ్‌విత్ 120బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదవ్వడం సంచలనం రేపుతోంది. ఈ రెండు ఛాన్సల్‌లో రఘురామకు స్లాట్స్ కేటాయించారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది.









Updated Date - 2021-05-15T19:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising