ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు

ABN, First Publish Date - 2021-11-02T02:22:27+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడిచిన మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడిచిన మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వేకువ జాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జిల్లావ్యాప్తంగా సరాసరి 24.10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాపూరు మండలంలో 78.2 మి.మీ, కలిగిరిలో 70 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్నా నదికి వరద పోటెత్తుతోంది. సోమశిల జలాశయానికి ఆదివారం ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది. ఉదయం 18 వేల క్యూసెక్కులు ఉండగా సాయంత్రానికి 35 వేల క్యూసెక్కులకు పెరిగింది. సోమశిల పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 74 టీఎంసీలకు చేరుకుంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో సోమశిల నుంచి సముద్రానికి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2021-11-02T02:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising