ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బద్వేల్‌లో భారీ వర్షం.. ఇబ్బంది పడుతున్న ఓటర్లు

ABN, First Publish Date - 2021-10-30T20:23:57+05:30

బద్వేల్‌లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా వాన మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేల్: బద్వేల్‌లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా వాన మొదలైంది. బద్వేలు నియోజకవర్గంలోను జోరుగా వర్షం కురిసింది. ఈ వర్షాన్ని లెక్కచేయకుండా పోలింగ్‌ సిబ్బంది నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులోని బాల యోగి గురుకుల పాఠశాలనుంచి 281 పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి తరలించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ సిబ్బందికి గొడుగులను ఏర్పాటు చేశారు. బద్దేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ తెలిపారు. బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా  విజయానంద్ పరిశీలిస్తున్నారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చినట్లు తెలిపారు. స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఓటింగ్ ప్రక్రియను 24 మంది అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని విజయానంద్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-30T20:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising