ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

46 శాతం మందికి రెండు డోసులు: వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

ABN, First Publish Date - 2021-10-26T00:10:31+05:30

రాష్ట్రంలో 46 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయినట్టేనని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో 46 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయినట్టేనని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికి ఏపీలో 5 కోట్ల 2 లక్షల 40 వేల పై చిలుకు డోసుల కరోనా వ్యాక్సిన్ పూర్తి అయ్యిందన్నారు. 1.85 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ 85.35 శాతం మేర పూర్తి అయ్యిందని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టూ డోర్ సర్వే చేస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో 20 లక్షలకు పైగా వ్యాక్సిన్ పూర్తి అయ్యిందన్నారు. విశాఖ, తూర్పు గోదావరి లాంటి చోట్ల 85 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. 



ప్రభుత్వం అందిస్తున్న శిశు సంరక్షణ యోజన కిట్లు ఒక్కో దానికి 625 ఖర్చు అవుతోందని ఆయన తెలిపారు. ఆరోగ్య ఆసరాలో 1519 విధానాల ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. 193 కోట్ల రూపాయలను ఆరోగ్య ఆసరాగా ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు 160 కోట్లు వ్యయం చేశామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ప్రతీ సాధారణ డెలివరీకి 5 వేలు, సిజేరియన్‌కు 3 వేల రూపాయలు బాలింతలకు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగానే శిశు సంరక్షణ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను ఇతర పథకాలకు ఖర్చు చేస్తున్నామని అనిల్ కుమార్ తెలిపారు. 

Updated Date - 2021-10-26T00:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising