ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్‌టీ-ఎస్‌టీఐ హబ్‌ ప్రాజెక్టు

ABN, First Publish Date - 2021-12-06T05:54:22+05:30

వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నుంచి మంజూరైన డీఎస్‌టీ-ఎస్‌టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులను ఆదివారం క్రోసూరు మార్కెట్‌ యార్డులో ఐసీఏఆర్‌ ప్రిన్సిపాల్‌ సైంటిస్టు డాక్టర్‌ ఓఎన్‌ తివారీ ప్రారంభించారు.

బ్రోచర్లు విడుదల చేస్తున్న విజ్ఞాన్‌ యూనివర్సిటీ నిర్వాహకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రోసూరు, డిసెంబరు 5: వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నుంచి మంజూరైన డీఎస్‌టీ-ఎస్‌టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులను ఆదివారం క్రోసూరు మార్కెట్‌ యార్డులో ఐసీఏఆర్‌ ప్రిన్సిపాల్‌ సైంటిస్టు డాక్టర్‌ ఓఎన్‌ తివారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్‌ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని డీఎస్‌టీ - ఎస్‌టీఐ హబ్‌ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని షెడ్యూల్‌ కులాల ప్రజల ఆదాయాభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల కోసం ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్రోసూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సాంకేతికతను అలవాటు చేయడంతో పాటు ఔషద సుగంధ మొక్కల పెంపకం, పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని క్రోసూరు, సత్తెనపల్లి, చేబ్రోలు మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.  విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ కేవీ కృష్ణ కిషోర్‌ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు చేసేదిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వెంపా జాలయ్య, అనుముల శ్రీనివాసరెడ్డి, క్రోసూరు ఎంపీపీ పెరుమాళ్ళపల్లి కోటయ్య, వైసీపీ నాయకులు షేక్‌ గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-06T05:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising