ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు సందడి

ABN, First Publish Date - 2021-08-18T05:23:45+05:30

సాగర్‌ ఆయకట్టు అంతటా సాగు సందడి నెలకొంది. జలాశయం నుంచి కుడి కాలువకు నీటి సరఫరా జరుగుతోంది. బుగ్గవాగు రిజర్వాయర్‌ నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌ కుడి కాలువకు 6 వేల క్యూసెక్కులు

ఆయకట్టు ప్రాంతంలో విస్తృతంగా వరి సాగు 

160 టీఎంసీల నీటి కేటాయింపునకు ప్రతిపాదనలు


నరసరావుపేట, ఆగస్టు 17: సాగర్‌ ఆయకట్టు అంతటా సాగు సందడి నెలకొంది. జలాశయం నుంచి కుడి కాలువకు నీటి సరఫరా జరుగుతోంది. బుగ్గవాగు రిజర్వాయర్‌ నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కాలు వలకు జలకళ సంతరించుకొంది. రైతులు విస్తృతంగా వరి సాగు చేపట్టారు. ఒకవైపు వరి నారుమళ్ళు, మరోవైపు వరినా ట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కుడికాలువకు 160 టీఎంసీల నీటి కేటాయింపుకు ప్రతిపాదనలు పంపినట్టు జలవనుల శాఖ ఎస్‌ఈ పురుషోత్తం గంగరాజు సోమవారం తెలిపారు. మూడు నుంచి మూడున్నర లక్షల ఎకరాల వరకు వరిసాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.  సాగర్‌ కుడికాలువకు సాగుకు నీటి సరఫరా కోసం 160 టీ ఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. సెప్టెంబరు నెలాఖరు కల్లా ఆయకట్టు అంతటా వరినాట్లు పూర్తయ్యే అవ కాశాలు కన్పిస్తున్నాయి. ఆయకట్టులో పండే బీపీటీ బియ్యా నికి ఇతర రాష్ట్రాలలో మంచి గిరాకి ఉంది. దీంతో ఈ రకం వరి సాగుపై రైతులు మొగ్గు చూపు తున్నారు. ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, జేజేఎల్‌ 389 వరి రకాలను వ్యవసాయ శాఖ సూచి స్తోంది. రైతులు, వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ల నిర్వాహకులు, వరిసాగుకు సంబంధించిన అన్ని రం గాల వారు బీజీ అ య్యారు. గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వరినాట్లకు వ్యవ సాయ కార్మికులు పల్నాడు ప్రాంతానికి పెద్దఎత్తున వలసలు వస్తున్నారు. సాగర్‌ జలాశయంలో 590 అడుగులు పూర్తిస్థా యి నీటిమట్టం కాగా 589.7 అడుగులు, 311.14 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి 46,285 కూసెక్కుల వరద నీరువస్తుండగా ఇదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2021-08-18T05:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising