ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథలు, బాల కార్మికులకు కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2021-05-20T05:33:00+05:30

జిల్లావ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్‌ ముష్కాన్‌ నిర్వహించారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, హోటళ్లు, దాబాలు, ఆటో గ్యారేజ్‌లలో పనిచేస్తున్న బాల కార్మికులు, వీధి బాలలను గుర్తించి వారిని ఐసీడీఎస్‌, ఎన్జీవోల సహకారంతో పోలీసు కార్యాలయానికి తరలించారు.

వీధి బాలలు, బాల కార్మికులకు కరోనా పరీక్షలను పరిశీలిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, అదనపు ఎస్పీ గంగాధరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు బాలలు క్వారంటైన్‌కు తరలింపు

గుంటూరు, మే 19:  జిల్లావ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్‌ ముష్కాన్‌ నిర్వహించారు.  రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, హోటళ్లు, దాబాలు, ఆటో గ్యారేజ్‌లలో పనిచేస్తున్న బాల కార్మికులు, వీధి బాలలను గుర్తించి వారిని ఐసీడీఎస్‌, ఎన్జీవోల సహకారంతో  పోలీసు కార్యాలయానికి తరలించారు.  65 మంది బాలలను గుర్తించి వారందరికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో ముగ్గురికి పాజిటివ్‌ రాగా వారి తల్లిదండ్రుల అనుమతితో తక్కెళ్లపాడు టిడ్కో క్వారంటైన్‌కు తరలించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సూచనల మేరకు బాల కార్మికుల తల్లిదండ్రులను పిలిపించి వారిని పనిలో పెట్టటంగానీ, వీధుల్లో వదిలేయటం కానీ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లలను పనుల్లో పెట్టటం మంచిదికాదన్నారు.అదనపు ఎస్పీ గంగాధరం ఆధ్వర్యంలో స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలు ఆపరేషన్‌ ముష్కాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-20T05:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising