ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెంబరు ప్లేట్‌ లేని ద్విచక్ర వాహనాలు సీజ్‌

ABN, First Publish Date - 2021-07-24T05:42:25+05:30

అర్బన్‌ పరిధిలో నెంబరు ప్లేటు లేని వాహనాలపై శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నెంబరు ప్లేటు లేకుండా తిరుగుతున్న 150 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసినట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ వీవీ రమణకుమార్‌ తెలిపారు.

నంబరు ప్లేటు లేని వాహనాలను సీజ్‌ చేస్తున్న ట్రాఫిక్‌ డీఎస్పీ రమణకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూలై 23: అర్బన్‌ పరిధిలో నెంబరు ప్లేటు లేని వాహనాలపై శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నెంబరు ప్లేటు లేకుండా తిరుగుతున్న 150 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసినట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ వీవీ రమణకుమార్‌ తెలిపారు. ట్రాఫిక్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రైవ్‌లో రవాణా ఉప కమిషనర్‌ మీరాప్రసాద్‌, ఎంవీఐలు, తూర్పు ట్రాఫిక్‌ సీఐ ఎల్‌.వీరానాయక్‌, ఎస్‌ఐలు శివరామకృష్ణ, శ్రీహరి, కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, నరేంద్ర పాల్గొన్నారు.  

వాహనాల నెంబరు ప్లేట్ల తనిఖీలు 

నిబంధనలకు విరుద్ధంగా నెంబరు ప్లేట్‌లను అమర్చిన వాహనాలపై రవాణాశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.  మొత్తం 60 వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు డీటీసీ ఈ మీరాప్రసాదు పేర్కొన్నారు.  కొంతమంది వాహన యజమానులు రవాణా వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని, రవాణేతర అవసరాలకు తిప్పుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాహనాలపై ప్రభుత్వవాహనం అని ఉంటే ప్రత్యేక తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు. తనిఖీలలో ట్రాఫిక్‌ డీఎస్పీ వీవీ రమణకుమార్‌, మోటారు వాహన తనిఖీ అధికారులు రాములు, గోపాల్‌, ప్రసన్నకుమారి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising