ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు...!

ABN, First Publish Date - 2021-06-23T05:50:16+05:30

సీఎం జగన్‌ విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగులపై ఆశలు చల్లారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు మన్నవ వంశీ ఆరోపించారు.

జాబ్‌ క్యాలెడర్‌ ప్రతులను దగ్ధం చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన



గుంటూరు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగులపై ఆశలు చల్లారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌  గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు మన్నవ వంశీ ఆరోపించారు. జాబులు లేని క్యాలెండర్‌ ఎందుకంటూ మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వాటిని టీఎన్‌ఎస్‌ఫ్‌ కార్యకర్తలు దగ్ధం చేసి  నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో ఇచ్చామంటున్న 6లక్షల ఉద్యోగాలలో 2.59 లక్షల గ్రామ, వార్డు వలంటరీ ఉద్యోగాలే ఉన్నాయని తెలిపారు. 95వేల ఉద్యోగాలు అవుట్‌ సోర్సింగ్‌ విధానం ద్వారా ఆప్కోస్‌ అనే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి తెచ్చారని.. అవి కొత్త ఉద్యోగాలు కావన్నారు. డీఎస్సీ, ఎపీపీఎస్సీ గ్రూప్‌ -1, గ్రూప్‌ -2 నోటిఫికేషన్ల జాడ లేదన్నారు. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేతలు రాయపాటి అమృత్‌, ఇతర నగర నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising