ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-03-09T05:56:47+05:30

పట్టణ శివారు వినుకొండరోడ్డులోని పెరల్స్‌ కల్యాణ మండపం వద్ద సోమవారం తెలంగాణకు చెందిన అక్రమ మద్యాన్ని నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, లారీ నిందితులతో ఎస్‌ఈబీ సీఐ కర్ణ, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేట లీగల్‌, మార్చి 8: పట్టణ శివారు వినుకొండరోడ్డులోని పెరల్స్‌ కల్యాణ మండపం వద్ద సోమవారం తెలంగాణకు చెందిన అక్రమ మద్యాన్ని నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో  అక్కడ మాటువేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ సీఐ కసుకుర్తి కర్ణ విలేకర్లకు తెలిపారు. వినుకొండ రోడ్డులో ఏపీ 07టీఎం 7337 అనే వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు రూ.10 లక్షలు విలువైన 4464 తెలంగాణ మద్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. 12 టైర్ల లారీ యజమాని గోపవరపు ఆంజనేయులు, డ్రైవర్‌ బుడిగపాక నగేష్‌లను అరెస్టు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.51 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో కీలక పాత్రధారి పట్టణానికి చెందిన షేక్‌ మహమ్మద్‌, ఇతడికి సహాయకుడైన గుంటూరుకు చెందిన మల్లీలు పరారీలో ఉన్నారన్నారు. ఆంజనేయులు, నగేష్‌లను రిమాండ్‌ తరలిస్తూ న్యాయమూర్తి యూ మాఽధురి ఉత్తర్వులు జారీ చేశారని సీఐ తెలిపారు. 

బెల్లం ఊట  ధ్వంసం

బొల్లాపల్లి: మండలంలోని కనమలచెరువు శివారు బ్రిడ్జి తండా అటవీ సమీపంలో 58 రమ్ముల్లో నిల్వ చేసిన 12 వేల లీటర్ల బెల్లపు ఊటను ఎస్‌ఐ అనీల్‌ కుమార్‌, సిబ్బంది ధ్వంసం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-03-09T05:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising