ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఉపాధ్యాయులు బదిలీల కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2021-06-22T06:20:40+05:30

జిల్లాలోని మున్సిపల్‌, కార్పొరేషన్‌ పరిధిలో విలీన గ్రామాల్లోని పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఈవో ఆర్‌ ఎస్‌ గంగాభవాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

75 మందికి స్థానచలనం

గుంటూరు (విద్య),జూన్‌ 21: జిల్లాలోని మున్సిపల్‌, కార్పొరేషన్‌ పరిధిలో విలీన గ్రామాల్లోని పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొత్తం 80 మంది ఉపాధ్యాయులకుగాను 75 మందికి బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉత్తర్వులు జారీచేశారు. ఆయా ఉపాధ్యాయలు తమను మున్సిపల్‌, కార్పొరేషన్‌ పరిధిలోనే బదిలీలు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవల కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని తెలిపారు. బదిలీల కౌన్సెలింగ్‌లో ఎస్‌జీటీలు 45 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌  ఉర్దూ 4, ఎల్‌ఎఫ్‌ఎల్‌ 4, స్కూల్‌ అసిస్టెంట్‌ (బిఎస్‌) 2, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లీషు) 2, స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) 8, స్కూల్‌ అసిస్టెంట్‌ (పిఎస్‌) 8, స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌) 3 పోస్టులు చొప్పున ఉన్నాయని తెలిపారు. కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని డీఈవో తెలిపారు. బదిలీ కౌన్సెలింగ్‌లో విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ షేక్‌ సంధాని, ఉర్దూ డీఐ ఎస్‌కె ఎండి ఖాసిం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising