ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్రాసిటీ చట్టాలు రాజకీయలబ్ధికి వినియోగం

ABN, First Publish Date - 2021-07-30T06:28:22+05:30

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఉపయోగించకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మానుకొండ శివప్రసాద్‌ విమర్శించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ దళిత నేతలు మానుకొండ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఉపయోగించకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మానుకొండ శివప్రసాద్‌ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో రాజ్యాంగ ధిక్కరణ, చట్టాల ఉల్లంఘనలు అడుగడుగునా జరుగుతున్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దళితులపై వందలాది దాడులు, దౌర్జన్యాలు అనేకం జరిగాయన్నారు. ఇదేమిటని ప్రశ్నించిని ప్రతిపక్ష నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే   మంత్రిగా పనిచేసిన దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. దళిత ఓట్లతో గద్దెనెక్కి దళితులను  ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ వారికి హక్కులను కాలరాస్తున్న సీఎం జగన్‌ చరిత్ర హీనుడుగా మిగిలపోతరన్నారు. సమావేశంలో నాయకులు తలతోటి సురేంద్ర, నక్కల అగస్టీన్‌, గుడిమెట్ల దయారత్నం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising