ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రబ్బరు స్టాంపులా హోం మంత్రి!

ABN, First Publish Date - 2021-06-22T06:19:01+05:30

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువయ్యిందని తెలుగుమహిళ గుంటూరు పార్లమెంటు అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతున్న తెలుగుమహిళా నేత జయలక్ష్మి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నాబత్తుని జయలక్ష్మి

గుంటూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువయ్యిందని తెలుగుమహిళ గుంటూరు పార్లమెంటు అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి విమర్శించారు. తాడేపల్లి సీతానగరం పుష్కరఘాట్‌లో అత్యాచారానికి గురై జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని సోమవారం ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే అత్యాచారాలు జరగుతున్నాయంటూ ఇక రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. దశ లేని దిశ చట్టాలు నిద్రపోతున్నాయా అంటూ ప్రశ్నించారు. ప్రతిరోజూ ఏదో ఒక అఘాయిత్యం మహిళలపై జరుగుతున్నా, మహిళా హోంమంత్రి స్పందించకుండా రబ్బరుస్టాంపులా మిగిలిపోతున్నారని విమర్శించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. బాధితురాలితో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని జయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో మహిళా నేతలు నేపాక పద్మ, పి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-06-22T06:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising