ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తానా సేవలు ఎల్లలు లేనివి

ABN, First Publish Date - 2021-12-08T05:25:06+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలో మంగళవారం నిత్య అన్నదాన పథకాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ప్రారంభించారు.

జిల్లా వైద్యశాల ఆవరణలో తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్‌, తానా ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే శివకుమార్‌

తానా అన్నపూర్ణ పథకం ప్రారంభం

తెనాలిటౌన్‌, డిసెంబరు7: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలో మంగళవారం నిత్య అన్నదాన పథకాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కాట్రగడ్డ సుబ్బారావు, కాళికాంబ దంపతుల జ్ఞాపకార్ధం రోజూ 150మందికి నిత్యం అన్నదానం చేయనున్నారు. కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, సుధాకర్‌ సోదరులు దాతలుగా ఈ కార్యక్రమాన్ని  తెనాలిలో నిర్వహిస్తున్నారు. తానా ప్రెసిడెంట్‌ లావు అంజయ్యచౌదరి, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట,  తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శృంగవరపు నిరంజన్‌, తానా అన్నపూర్ణ కోఆర్డినేటర్‌ పుట్టగుంట సురేష్‌, తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కసుకుర్తి రాజా, ఇస్కాన్‌ ఆపరేషన్‌ హెడ్‌ విలాస విగ్రహదాస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తానా ప్రతినిధులను శివకుమార్‌ సత్కరించారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖలేదా నసీమ్‌, డాక్టర్‌ శారద, కుమార్‌ పంప్స్‌ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వైద్యశాల ఆర్‌ఎంవో రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

    

Updated Date - 2021-12-08T05:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising